సీఎం చేతుల మీదుగా చెక్కు అందుకున్న రాహుల్ పటేల్

*సీఎం చేతుల మీదుగా అభయ హస్తం చెక్కు అందుకున్న జమ్మికుంట వాసి రాహుల్ పటేల్*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 27*

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సివిల్స్ కోసం అభయహస్తం చెక్కును జమ్మికుంట ప్రాంతానికి చెందిన విద్యార్థి ముదాం రాహుల్ పటేల్ అందుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఐపీఎస్ ,ఐఏఎస్ చదువుతున్న విద్యార్థులకు అభయస్తం పేరుతో విద్యను ప్రోత్సహిస్తూ వారికి సహకారం అందిస్తున్న తరుణంలో జమ్మికుంట పట్టణానికి చెందిన ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన బిడ్డ ముదం రాహుల్ పటేల్ కి విద్య అభ్యాసం కోసం చెక్కు అందించడం చాలా గర్వకారణం మామూలు రైతు కుటుంబంలో పుట్టి పై విద్యాభ్యాసం కోసం ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విద్యార్థి తల్లిదండ్రులను గ్రామస్తులు అభినందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యార్థి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు

Join WhatsApp

Join Now