మోదీ ఝళిపి లోక్‌సభలో రాహుల్‌కు గట్టి కౌంటర్

మోదీ ఝళిపి  లోక్‌సభలో రాహుల్‌కు గట్టి కౌంటర్

  • ♦️ప్రధాని మోదీ ఝళిపి – లోక్‌సభ వేదికగా రాహుల్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్
  • ♦️ఆపరేషన్ సిందూర్‌పై దేశ గర్వాన్ని వెలిబుచ్చిన మోదీ
  • ♦️ఉగ్రవాద స్థావరాలపై సైన్యం ధ్వంసాత్మక చర్యలు చేపట్టిందన్న ప్రధాని
  • ♦️దేశ రక్షణలో రాజీ లేదు – విదేశాల్లో విమర్శలు సైనికుల మనోధైర్యానికి గాయమన్న హెచ్చరిక

న్యూఢిల్లీ, జూలై 29:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా గట్టిగ స్పందించారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. “ఆపరేషన్ సిందూర్‌” ద్వారా భారత సైనికుల పరాక్రమం ప్రపంచానికి కనిపెట్టిందని మోదీ వ్యాఖ్యానించారు.“పాకిస్తాన్ అణ్వాయుధ బెదిరింపులకు భయపడి మౌనంగా కూర్చోలేదు. వ్యూహాత్మకంగా ముందుకెళ్లి, ఉగ్రవాదుల స్థావరాలను మట్టుబెట్టాం. ముష్కరులను వారి గుహల నుంచే లాగి చిత్తుచేశాం. భారత సైన్యానికి రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛనిచ్చాం” అని ఆయన గర్జించారు.రాహుల్ గాంధీ విదేశీ వేదికలపై భారత్‌ను విమర్శించడం సరికాదన్నారు ప్రధాని. “ఇలాంటివి సైనికుల మనోధైర్యానికి గాయపరచొచ్చు. దేశ భద్రత వంటి విషయాల్లో రాజకీయ లాభనష్టాలను పక్కనబెట్టి దేశ ప్రయోజనాన్ని ముందుండిపెట్టాలి” అంటూ ఆయన హెచ్చరించారు.

Join WhatsApp

Join Now