పేకాట స్థావరాలపై దాడి
– రూ. 2,730/- నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం.
*సిద్దిపేట జిల్లా ప్రతినిధి, జనవరి 05 ( ప్రశ్న ఆయుధం ):*
పేకాట స్థావరం పై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టేషన్ పరిధిలో గల తెలంగాణ ధర్మకాండ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, కలిసి దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 2,730/- నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశంలో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.