: తెలంగాణకు రెయిన్ అలెర్ట్.. మూడు రోజులు వర్షాలు..!!_*
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడే అవకాశముందని పేర్కొంది.
దీంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
*_కనిష్ట ఉష్ణోగ్రతలు…_*
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు కనిష్టంగా ఉండే అవకాశముందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంచు కూడా ఏర్పడుతుందని, రహదారులపై ప్రయాణించే వారుతగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.