Site icon PRASHNA AYUDHAM

తెలంగాణలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు..

తెలంగాణలో పలుచోట్ల కురుస్తున్న వర్షాలు..

హైదరాబాద్‌ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, బంజారా హిల్స్, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, అమీర్ పేట, పంజా గుట్ట, ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తోంది.పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. వర్షం కారణంగా అక్క డక్కడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇవాళ శనివారం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది..అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్.. భారత్కు ఐఎండీ అలర్ట్..దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జంట నగరాలతో పాటు.హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

Exit mobile version