Site icon PRASHNA AYUDHAM

నేడు నుంచి వర్షాలు..

నేడు నుంచి వర్షాలు..

రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి చిరుజల్లులు కురవొచ్చునని తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి ఉకపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

నేటి నుంచి వర్షాలురాత్రి వేళలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు : వాతావరణ కేంద్రం

రాష్ట్రంలో ఈ నెల 29 నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో మాత్రం తేలికపాటి చిరుజల్లులు కురవొచ్చునని తెలిపింది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో భిన్న వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి ఉకపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు చలి వాతావరణం ఉంటుంది. ఖమ్మంలో 35డిగ్రీల అధిక పగటి ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 31డిగ్రీలు నమోదైనట్టు పేర్కొన్నారు

తప్పిన తుపాను ముప్పు

దానా తుపాను ముప్పు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఏపీ, తెలంగాణకు తప్పింది. కాగా, ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

Exit mobile version