రాజాబహాద్దూర్ వెంకట్రామారెడ్డి జయంతి వేడుకలు
కామారెడ్డి ఆర్బివిఆర్ఆర్ విద్యాపరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం
రాజాబహాద్దూర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
గ్రామీణ పేద విద్యార్థుల కోసం చేసిన కృషి స్మరణ
ట్రస్ట్ తరఫున త్వరలో హాస్టల్, పాఠశాల నిర్మాణం ప్రారంభం
ప్రశ్న ఆయుధం ఆగష్టు 22కామారెడ్డి:
కామారెడ్డి ఆర్బివిఆర్ఆర్ విద్యాపరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజాబహాద్దూర్ వెంకట్రామారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ – రాజాబహాద్దూర్ వెంకట్రామారెడ్డి నైజాం కాలంలోనే పేద, నిరుపేద విద్యార్థుల కోసం హాస్టల్స్, పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలోనే ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.
త్వరలోనే ట్రస్ట్ ఆధ్వర్యంలో హాస్టల్, పాఠశాల, వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాల కోసం భవన నిర్మాణం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నాగర్తి చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు కొప్పుల గంగారెడ్డి, గడ్డం రమేష్ రెడ్డి, మల్లారెడ్డి, నల్లవెల్లి కర్ణాకర్ రెడ్డి, బీంరెడ్డి, రాజిరెడ్డి, నారాయణరెడ్డి, ప్రతాప్ రెడ్డి, బాపురెడ్డి, సిద్దరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.