*ఏప్రిల్ 15,మంగళవారం*
*మహబూబాబాద్ జిల్లా,*
*రాజీవ్ యువ వికాసం పథకంలో అర్హులైన లబ్ధిదారులకు వేగంగా సేవలందించాలి*
*వేసవి నేపథ్యంలో ప్రజలకు త్రాగునీరు సరఫరాలో ఆటంకం కలగకుండా చూసుకోవాలి*::*జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అని నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ తదితర యువకులకు ఉపాధి కల్పన నిమిత్తం ఈ పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, ప్రభుత్వ సూచించిన లక్ష్యాల ప్రకారం లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకం ఇబ్బందులు లేకుండా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ కోరారు.
మంగళవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లాలోనీ బ్యాంకర్స్ ,సంబంధిత అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హులైన లబ్ధిదారులకు లక్ష్యాల ప్రకారం రుణాలు అందించాలని సూచించారు. దివ్యాంగులకు ఐదు శాతం అవకాశం కల్పించాలని, ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో యువత స్వయం ఆర్థిక అభివృద్ధి చెందడం కోసం ఈ పథకం ప్రవేశపెట్టిందని వారికి కావలసిన సౌకర్యాలను అందించాలని తెలిపారు. రుణాలు అందించడంలో బ్యాంకర్లు లబ్ధిదారులకు సహకరించాలన్నారు.
వేసవి నేపథ్యంలో జిల్లాలోని (1320), హ్యాబిటేషన్స్, మున్సిపల్ పరిధిలలో ప్రజలకు త్రాగునీరు అందించుటలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపల్ తదితర శాఖల సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు.
ఇప్పటికే సూచించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం త్రాగునీరు ఇబ్బందులు ఉన్నచోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానిక సోర్సులను సమకూర్చుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు,
మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు ప్రతినిత్యం మండలంలోని గ్రామాల స్థితిగతులు, త్రాగునీరు సరఫరా, సానిటేషన్, తనిఖీ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్ఎస్ తదితర మందులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
మిషన్ భగీరథ, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖ అధికారులు, డిఈ లు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శి లతో ప్రజలకు త్రాగునీరు సరఫరాపై సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు,
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, బిసి ఎస్సి ఎస్టి మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు నరసింహస్వామి, శ్రీనివాసరావు, దేశీ రామ్, శ్రీనివాస్, లీడ్ బ్యాంకు మేనేజర్ మూర్తి, డిపిఓ హరిప్రసాద్, డిసిఓ వెంకటేశ్వర్లు, సిపిఓ సుబ్బారావు, డివిహెచ్ఓ కిరణ్ కుమార్, డిఎస్ఓ ప్రేమ్ కుమార్, డిడి సురేష్ గ్రౌండ్ వాటర్, మిషన్ భగీరథ ఈఈ కృష్ణారెడ్డి, డిఏఓ విజయనిర్మల, జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల పంచాయతీ విస్తరణ అధికారులు, ఏపిఏంలు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.