కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి  “బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్లెన్స్ అవార్డు” అందుకున్న వైబ్రెంట్ అకాడమీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డిని సన్మానించిన టెన్త్ క్లాస్ మిత్ర బృందం.

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి  “బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్లెన్స్ అవార్డు” అందుకున్న వైబ్రెంట్ అకాడమీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డిని సన్మానించిన టెన్త్ క్లాస్ మిత్ర బృందం.

హనుమకొండ జిల్లా సెప్టెంబర్ 18

హనుమకొండ పట్టణంలో లెక్చరర్ గా రెండు దశాబ్దాల పాటు విద్యా బోధన చేసి అనేకమంది విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించి విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం గల చిట్టేటి రాజేందర్ రెడ్డి కార్పొరేట్ కాలేజీలకు దీటుగా హనుమకొండ పట్టణంలో రాజస్థాన్-కోటా వారి వైబ్రేంట్ అకాడమీ సంస్థను స్థాపించడం జరిగింది. ఈ కాలేజీలోని విద్యార్థులకు నాణ్యమైన మంచి విద్యను అందించడంతోపాటు, రుచికరమైన, పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ స్థాపించిన అనతి కాలంలోనే అనేక మంది విద్యార్థులతో ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యా సంస్థగా పేరుగాంచింది. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకుగాను రాజ్ న్యూస్ వారు రాజేందర్ రెడ్డిని గుర్తించి ఈ విద్యా సంవత్సరంలో” బెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు” ప్రధానం చేయడం జరిగింది. రాజేందర్ రెడ్డి కి అవార్డు రావడం పట్ల తన చిన్ననాటి మిత్రులైన పదవ తరగతి 1994 -95 మిత్ర బృందం ఈ రోజున ఘనంగా సన్మానిస్తూ అభినందించడం జరిగింది. సన్మానించిన వారిలో లావుడియా రాజు నాయక్, రాజేశ్వరరావు, రాజయ్య, రఘుపతి, సత్యనారాయణ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, తిరుపతి సుధాకర్, సుల్తాన్, రమేష్, నాగరాజు , రవి , సునీత సౌందర్య, సునీత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now