బాలనగర్ డివిజన్‌లో బీజేపీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం – ఈటల రాజేందర్ అలానే వడ్డేపల్లి రాజేశ్వరరావు
ప్రశ్న ఆయుధం జులై27: కూకట్‌పల్లి ప్రతినిధి
బాలనగర్ డివిజన్‌లో బీజేపీ నూతన పార్టీ కార్యాలయాన్ని డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవనికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ, ఈ నూతన పార్టీ కార్యాలయం ద్వారా పార్టీ కార్యకలాపాలు మరింత పటిష్టంగా నిర్వహించబడతాయని, ప్రజలకు మరింత దగ్గరగా సేవలందించేందుకు ఇది కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జి మాధవరం కాంతారావు,జిల్లా కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాంజాల పద్మయ, అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు,జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సురేందర్ రెడ్డి,బాలానగర్ డివిజన్ బీజేపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.