ఆర్యవైశ్య సంఘం మహాసభ మండల అధ్యక్షులుగా ఎనిమిళ్ళ రాజేంద్రప్రసాద్
జమ్మికుంట ప్రశ్న ఆయుధం జులై 21
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎనిమిళ్ళ రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఇటీవలనే ఎన్నికైన గుండె తిరుపతయ్య అకాల మరణం చెందడంతో రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకోవడం జరిగిందని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చంద్ర రాజు తెలిపారు జమ్మికుంట ఆర్యవైశ్యలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సంఘం కొరకు సేవలం అందిస్తున్నారని వారు ఈ పదవిలో 2026 వరకు కొనసాగుతారని తెలిపారు జమ్మికుంట ఆర్యవైశ్య మహాసభ సభ్యులతో పాటు,ఆర్యవైశ్యుల అభ్యున్నతికి, మహాసభ అభివృద్ధికి సేవలందించాలని జమ్మికుంట మండల ఆర్యవైశ్య మహాసభ పేరు ప్రఖ్యాతులను ఇనుమడింప చేయాలని జిల్లా అధ్యక్షులు చందా రాజు కోరారు