ఘనంగా మానసిక దివ్యాంగ పాఠశాలలో వొడితల రాజేశ్వరరావు వర్ధంతి వేడుకలు
జమ్మికుంట జూలై 24 ప్రశ్న ఆయుధం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో గురువారం దివంగత వొడితల రాజేశ్వరరావు 14వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చి రాములు మాట్లాడుతూ వొడితల రాజేశ్వరరావు ఎన్నోసార్లు ఆశ్రమాన్ని సందర్శించారని, వారు ఆశ్రమానికి తగిన సహాయ, సహకారాలు అందించారని గుర్తు చేశారు రాజేశ్వరరావు కుమారుడు వొడితల శ్రీనివాస్ రావు, వారి మనవడు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి
ప్రణయ్ బాబు ఆశ్రమానికి సహకరిస్తున్నారని తెలిపారు పాఠశాల తరఫున పేరెంట్స్ కమిటీ తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామనీ తెలిపారు ఆశ్రమంలో ఉన్న దివ్యంగ విద్యార్థులందరికీ పరంకుశం కృష్ణస్వామి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు,చేల్పూరు బుచ్చిబాబు పళ్ళు,స్వీట్స్, బిస్కెట్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో పరంకుశం కృష్ణ స్వామి చంద్రగిరి శ్రీనివాస్ సలీం పాషా,కొమరన్న పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.