ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 20, కామారెడ్డి :
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్ రోడ్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నో ఎనలేని సేవలు అందించిన మహానాయకుడని, ఈరోజు దేశం ఇంత అభివృద్ధి చెందడానికి రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన ఐటీ టెక్నాలజీ అని, 18 సంవత్సరాలకి ఓటు హక్కును కల్పించి యువకులకు ఎంతో మంచి చేశారని, పేద ప్రజల అభ్యున్నతి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి సంక్షేమానికి దోహదపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కారంగుల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రసన్న, వంశీ, అంజత్, ఉరుదుండ రవి, మాజీ కౌన్సిలర్ జమీల్, బీసీ చైర్మన్ గుడ్ల శ్రీనివాస్, పంపర లక్ష్మణ్, రంగా రమేష్, యూసుఫ్, సిద్ధి జమీల్, రాణా ప్రతాప్, కిరణ్, జమీల్ ,విక్రమ్, లెక్కపదిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.