*దేశ భవిష్యత్తు యువత చేతిలో అని యువతకు అవకాశాలు కల్పించి దేశ ప్రగతికి బాటలు వేసిన నాయకుడు రాజీవ్ గాంధీ*
*భారత దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ సేవలు ఆదర్శనీయం*
*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్*
*ఇల్లందకుంట మే 21 ప్రశ్న ఆయుధం*
దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని యువతకు అనేక అవకాశాలు కల్పించి దేశ ప్రగతికి బాటలు వేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని భారతదేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు ఆదర్శనీయమని ఇల్లందకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ అన్నారు మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో గల గరుడ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని రాజీవ్ గాంధీప్రధానిగా ఆధునికత ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని సైన్స్ ని ప్రోత్సహించారని టెలీకాం రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చారని శాంతి, ప్రజాస్వామ్య విలువలకు తన జీవితాన్ని అంకితం చేశారు.
ఈ దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉందని యువతకు అవకాశాలు కల్పించి దేశ ప్రగతికి పాటుపడాలని సంకల్పించారు ఓటు హక్కు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు గొప్ప అవకాశాన్ని కల్పించారని రాజీవ్ గాంధీ పంజాబ్ ఒప్పందం, ఇండియా శ్రీలంక ఒప్పందం వంటి శాంతి నిర్ణయాలతో ప్రపంచ మన్ననలు పొందారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, కనుమల్ల రామకృష్ణ,కనుమల్ల సంపత్, అన్నం ప్రవీణ్, మారపెల్లి ప్రశాంత్, పెద్ది శివకుమార్ మీస రాజయ్య, గురుకుంట్ల స్వామి, మ్యాదద తిరుపతి రెడ్డి, భోగం సాయిరాం, మూడెత్తుల మల్లేశం, సింగిరెడ్డి గోపాలరెడ్డి, కారింగుల రాజేందర్, గుండారపు సాయి, గొడిశాల పరమేశ్వర్, బొమ్మ శ్రీనివాస్,గొడుగు మానస, గూడేపు ఓదెలు, అరే రమేష్, తాడెం దిలీప్, మహమ్మద్ అజ్గర్ పాషా, రెడ్డి సారంగం, గైకోటి రాజు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.