*సచివాలయం లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరికాదు*
*మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్*
గజ్వేల్ సెప్టెంబర్ 17 ప్రశ్న ఆయుధం :
బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిండాన్నీ వ్యతిరేఖిస్తూ గజ్వేల్ మండల్ అహ్మదీపూర్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ప్రో జయ శంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి, తెలంగాణ తల్లిని అవమాన పరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరు ఖండించాలన్నారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్నోళ్లెవరూ రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్ర్యం సిద్దించినప్పటికీ ఆంద్ర లో విలీనం అయినప్పటి నుండి తెలంగాణ వివక్షకు గురైందన్నారు.కేసీఆర్ అలుపెరుగని పోరాటంతో, అమర వీరుల త్యాగలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని, అమరవీరుల త్య ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం అని గుర్తు చేశారు. గుక్కెడు నీళ్ల కోసం, కరెంట్ కోసం, ఉపాధి కోసం అష్ట కష్టాలు ప్రజలు పడ్డారాని కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్లలోనే అభివృద్ధి, సంక్షేమం లో దేశంలో నే ఆదర్శంగా నిలిచిందన్నారు..మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు..ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని అన్నారు.సచివాలయం లో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సరికాదని
తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం లో ఏర్పాటు చేయడం నువ్వు ఎవరి మెప్పు కోసం చేస్తున్నావో ప్రజలకి తెలుసన్నారు.రాజీవ్ గాంధీ మీద అంత ప్రేమ ఉంటే గాంధీ భవన్ లో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మహనీయుల మీద ప్రేమ ఉంటే సచివాలయం లో తెలంగాణ తల్లి విగ్రహం తో పాటు తెలంగాణ త్యాగ ధనుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
తెలంగాణ రాజసానికి నిలువెత్తు సాక్ష్యం రాష్ట్ర సెక్రటేరియట్ అని తెలంగాణ ప్రజల
ఆత్మగౌరవ పాలనను ప్రతిబింబించే సౌధం దశాబ్దాల పోరాటాన్ని పోతపోసుకున్న భవనం ముందు ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం మానుకోవాలని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ, కాళేశ్వరం, రాష్ట్ర సచివాలయం, అమరవీరుల స్థూపం, 125 అడుగులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ప్రజల గౌరవం, రాష్ట్ర ఖ్యాతిని పెంచిన ఒక తీపి గుర్తుగా చేసిన ఘనత కేసీఆర్ గారిదన్నారు. వీలైతే మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని ఇలాంటి విగ్రహాలతో తెలంగాణ రాష్ట్ర చరిత్రను, అస్తిత్వాన్ని మసకబర్చే ప్రయత్నం చేస్తే మీకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, మద్ది రాజిరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ చడా శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేశ్ గౌడ్, మాజీ కో అప్షన్ అహ్మద్, గ్రామ పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, మాజీ ఎంపీటీసీ ఆనందం, నాయకులు రామగౌడ్, రాంరెడ్డి, సత్యగౌడ్, అగయ్య ,ముత్యం గౌడ్, బాలయ్య, రాములు, రాజ్ కుమార్, భూపతి, గోపాల్ రెడ్డి, అమరెందర్ రెడ్డి, సత్తిరెడ్డి, సంపత్ రెడ్డి, రాజు, లచ్చిరెడ్డి, సింహం, చంద్రం, యువకులు, నాయకులు పాల్గొన్నారు.