*కామారెడ్డి జిల్లాలో రాజీవ్ హనుమంతు పర్యటన*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 26
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ప్రగతి వివిధ పథకాల అమలు గురించి ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది కామారెడ్డి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమించబడిన రాజీవ్ హనుమంతు ఈరోజు జిల్లా పర్యటనలో భాగంగా బిక్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది.
* ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి వైద్యులు వైద్య సిబ్బంది పనితీరు గురించి రాజీవ్ హనుమంతు సమీక్షించారు
* ఆసుపత్రిలో ఉన్న వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఆసుపత్రిలో గల ఇన్ పేషెంట్ వార్డు ఫార్మసీ గది ప్రసూతి గది లాబరేటరీ విభాగాన్ని తనిఖీ చేశారు ఎన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అలాగే ల్యాబ్ ద్వారా అందుతున్న పరీక్షల సేవల గురించి ఆరా తీశారు
* ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వివిధ రకాల సేవలు అనగా ఔట్ పేషెంట్ సేవలు గర్భిణీ పరీక్షలు చిన్న పిల్లల వ్యాధినిర్వక టీకాల వివరాలు మరియు కుక్కకాటుకు సంబంధించినటువంటి రాబిస్ వ్యాక్సిన్ వివరాలు మరియు అవసరమైన మందుల యొక్క నిలువ వివరాలు వైద్యాధికారి ని అడిగి తెలుసుకున్నారు.
* ప్రస్తుతం భారీ వర్షాలు, వరదలు, వాతావరణంలో సంభవించే మార్పుల ద్వారా కలిగే సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అప్రమత్తంగా ఉండాలని మరియు ఇట్టి సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం తగిన చర్యలు మందు జాగ్రత్త చర్యలు చేపడుతూ కావలసిన అత్యవసర మందుల యొక్క నిలువలు తగినంత అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
* బిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి మరియు వసతుల గురించి తెలుసుకున్న ప్రత్యేక అధికారి రాజీవ్ హనుమంతు మరియు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ నసంతృప్తి వ్యక్తం చేశారు.
* జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణ మరియు ముందు జాగ్రత్త చర్యల గురించి అప్రమత్త చర్యలు మరియు జిల్లాలో తీసుకున్న ముందస్తు చర్యలు మరియు సంసిద్ధత గురించి చేపట్టిన కార్యాచరణ గురించి అడిగి తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
* అధికారి రాజీవ్ హనుమంతు ప్రత్యేకంగా జిల్లాలో గల యూరియా సరఫరా మరియు తగినంత యూరియా నిలువ గురించి సమీక్షించారు యూరియా నిలువ మరియు సరఫరా విషయంలో గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరంలో కొంత తేడా ఉండడాన్ని గమనించిన ప్రత్యేక అధికారి జిల్లా వ్యవసాయ అధికారిని వివరణ అడిగినారు
* జిల్లాలోని ప్రతి మండలాలలో యూరియా కొరత లేకుండా సరఫరాలో జాప్యం జరగకుండా రైతులకు తగిన సమయంలో తగినంత యూరియా సరఫరా అయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు.
* పంచాయతీరాజ్ శాఖ రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖ మరియు ఇతర అధికారులను సిబ్బందిని అధిక వర్షపాతం వరద ల ద్వారా సంభవించే సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
* ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తో పాటు అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రభు కిరణ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డివిజనల్ పంచాయతీ అధికారి బిక్నూర్ తాసిల్దార్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.