రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలి

*రాజీవ్ యువ వికాసం పథకం గడువు పొడిగింపును సద్వినియోగం చేసుకోవాలి*

*జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న*

*జమ్మికుంట ఏప్రిల్ 14 ప్రశ్న ఆయుధం*

ప్రజాపాలన చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకుల ఉపాధి కల్పన ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడవు ఈనెల 14 నుండి 24 వరకు పొడిగించి ఉత్తర్వులు జారీ చేయడం శుభ పరిణామం అని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకొని ఉపాధి కల్పన కొరకు పాటుపడాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం కోరారు. సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజా పాలన చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ మంత్రి వర్గం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతి యువకులను ఉపాధి కల్పన ధ్యేయంగా సర్వతో ముఖాభివృద్ధి చెందాలని ఉద్దేశంతో యువతను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యువ వికాసం పథకం కోసం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రూ 6000 కోట్లను కేటాయించడం జరిగిందని గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనలో యువతి యువకులు ఉన్నత చదువులు చదివినప్పటికీ ఉపాధి అవకాశాలు,ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చిన ప్రజా పాలన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు లకు హుజురాబాద్ నియోజకవర్గం నిరుద్యోగ యువతి యువకుల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment