*ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి రాజు*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో జూలై 31*
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ కి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేసి
వడ్ల రాజు మాట్లాడుతూ పదేళ్ల క్రితం పెండ్లైన వారికి బడికి వెళ్లే పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు వారికి రేషన్ కార్డు లేకపోవడంతో అనేక రకాల పథకాలు పొందలేకపోతున్నారని వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని చాలామంది నిరుపేదలు ఉండటానికి ఇల్లు లేక నానా అవస్థలు పడుతున్నారని ఇండ్లు కిరాయి అద్దెలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మహిళలకు 2500 భృతి అదేవిధంగా గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ రావడం లేదని గ్యాస్ సబ్సిడీ అందడం లేదని వెంటనే ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి అర్హులైన వారందరికీ గృహజ్యోతి గ్యాస్ సబ్సిడీ అందేలా చూడగలరని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ లేనియెడల రాబోయే రోజుల్లో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రాయి కంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు