ఆరు రాజ్యసభ స్థానాలకు బై ఎలక్షన్స్..!!

రాజ్యసభ
Headlines
  1. ఆరు రాజ్యసభ స్థానాలకు బై ఎలక్షన్ షెడ్యూల్ విడుదల
  2. డిసెంబర్ 20న పోలింగ్: కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
  3. ఏపీ, వెస్ట్ బెంగాల్, ఒడిశా, హర్యానాలో రాజ్యసభ ఎన్నికలు
  4. 3 రాష్ట్రాల రాజ్యసభ స్థానాలకు బై ఎలక్షన్: డిసెంబర్ 20న పోలింగ్
  5. రాజీనామా చేసిన ఎంపీల కోసం బై ఎలక్షన్ షెడ్యూల్ విడుదల
షెడ్యూల్ రిలీజ్ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

డిసెంబర్ 20న పోలింగ్.. అదే రోజు లెక్కింపు

న్యూఢిల్లీ : ఏపీతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఇటీవల ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాల బై ఎలక్షన్ కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది.

ఏపీలో మూడు, వెస్ట్‌ బెంగాల్, ఒడిశా, హర్యానాలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీఐ సెక్రటరీ సుమన్‌ కుమార్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు 29న వైఎస్సార్‌ సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ఇటీవల రాజ్యసభ చైర్మన్‌ జగదీప్ ధన్ఖడ్ ఆమోదించారు.

 సుందిళ్ల బ్యారేజీలో 2ఏ బ్లాక్ పరిస్థితి ఇదీ

అలాగే ఒడిశాకు చెందిన సుజీత్‌కుమార్, వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన జవహర్‌ సర్కార్, హర్యానాకు చెందిన కృష్ణన్‌ లాల్‌పన్వార్‌ కూడా రాజీనామా చేశారు. డిసెంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నామినేషన్ల స్వీకరణకు 10వ తేదీ, ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇక డిసెంబర్‌ 20న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజు 5 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీఐ పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment