పోలీస్ స్టేషన్ లో రాఖీ పండుగ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 9
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్
రాఖీ పౌర్ణమి సందర్భంగా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందిలో సోదర-సోదరీభావాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. మహిళా పోలీస్ సిబ్బంది, సహచర పురుష సిబ్బందికి రాఖీలు కట్టి, పరస్పర రక్షణ, సహకారం, మరియు స్నేహభావానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకున్నారు.
సదాశివ నగర్ స్టేషన్ ఎస్ఐ పుష్పరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రాఖీ పండుగ కేవలం సాంప్రదాయం మాత్రమే కాకుండా, మన మధ్య పరస్పర నమ్మకం మరియు రక్షణ భావనను మరింత బలపరిచే పండుగ” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, సోదరభావంతో పండుగను జరుపుకున్నారు.