రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన….సత్యం శ్రీరంగం
ప్రశ్న ఆయుధం ఆగస్టు 09: కూకట్‌పల్లి ప్రతినిధి
” ఎన్నాళ్ళయినా, ఎన్నేoడ్లయినా చెరిగిపోని బంధం అన్నా చెల్లెళ్ల అనుబంధం అంతటి గొప్ప అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం. ”
” రక్తం పంచుకుని పుట్టకున్నా అక్కా, చెల్లి అని ఆప్యాయంగా పిలిచే ఈ బంధానికి కుల మత బేధాలు లేవు – టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం. ”
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం తన నివాసంలో ఇంటి ఆడపడుచు తొడబుట్టిన సోదరిమని సౌమిత్రి రాజ్యలక్ష్మి రాఖీ కట్టి, హారతి ఇచ్చి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. మరియు బాలానగర్ లో ఎఎంసి చైర్మన్ పుష్పా రెడ్డి నివాసంలో నిర్వహించిన రాఖీ వేడుకలకు హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం కి మహిళా సోదరీమణులందరు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేసి రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళా సోదరీమణులందరు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఆప్యాయత, నమ్మకానికి అన్నా చెల్లెళ్ల అక్క తమ్ముడు మధ్య విడదీయరాని బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని అన్నారు. ఎన్నాళ్ళయినా, ఎన్నేoడ్లయినా చెరిగిపోని బంధం అన్నా చెల్లెళ్ల అనుబంధం అనీ, అంతటి గొప్ప అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని అన్నారు. ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీకు ఎల్లపుడు అండగా ఉంటా రాఖీ కట్టిన ప్రతి సోదరీమణులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రతి మహిళను అభివృద్ధి పధంలో నడిపిస్తూ ఆర్ధిక అభివృద్ధి సాధిస్తూ వారిని స్వతంత్రులుగా ప్రగతి సాధించడం కోసం మహిళలు ఆర్ధికంగా ఎదగడం కోసం మహిళా శక్తి పథకం తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మీ, ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి, సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు రేష్మా, డివిజన్ ల మహిళా అధ్యక్షురాళ్లు విజయలక్ష్మీ, మారుతీ పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.