సోదర భావంతో మంత్రికి రాఖీలు
శనివారం ఖమ్మం క్యాంపు కార్యాలయం పండుగ వాతావరణంలో మెరిసింది. వివిధ హోదాల్లో ఉన్న మహిళలు, గృహిణులు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సోదర భావంతో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గారు.. రాఖీ పండుగ అంటేనే సోదర,సోదరీమణుల అనుబంధానికి, ఆప్యాయతకు ప్రతీక అన్నారు. ఒక అన్నగా ఆడబిడ్డలకు అండగా ఉంటానని తెలిపారు. దీంతో వారు చాలా సంతోషంగా మీరు మాకు సోదరుడు మాత్రమే కాదు, మా కుటుంబానికి అండ” అని కొనియాడారు. మహిలందరికీ మంత్రి గారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షాలు తెలిపారు.
అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన శుభకార్యక్రమాలకు హాజరయ్యారు. అక్కడ కూడా మహిళల చేత రాఖీలు కట్టించుకున్నారు.