మత సామరస్యానికి ప్రతీక రక్షాబంధన్
ప్రశ్న ఆయుధం 09 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి )
బాన్సువాడ పట్టణంలోని 13 వ వార్డు టీచర్స్ కాలనీ లో రాఖీ పండుగ పురస్కరించుకొని మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గౌస్ పాషా కు పలువురు కాలనీ మహిళలు ఇంటి వద్దకు వెళ్లి రాఖీలు కట్టారు మత సామర్థ్యానికి ప్రతీక గా పండుగను జరుపుకున్నట్టు వారు తెలిపారు. కాలనీలో వివిధ మతాలవారు వర్గాల వారు ఉన్నప్పటికీ అందరము అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెలు లాగా కలిసిమెలిసి ఉంటామని మొహమ్మద్ గౌస్ తెలిపారు.ఈ సందర్భంగా మహిళల చేత రాఖీ కట్టించుకొని స్వీట్లు పరస్పరం తినిపించుకున్నారు పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.