రామచంద్రపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

విద్యార్థుల
Headlines
  1. రామచంద్రపురం పాఠశాలలో 25 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  2. 1998-1999 విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: పాఠశాలలో 25 సంవత్సరాల తర్వాత సంతోషకరమైన కలయిక
  3. ఉపాధ్యాయుల సన్మానం: 25 సంవత్సరాల తర్వాత విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
  4. రామచంద్రపురంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: పాఠశాల సాంప్రదాయాలు గుర్తించబడ్డాయి
  5. పూర్వ విద్యార్థుల సమావేశంలో ఓం ప్రకాష్, ఉపాధ్యాయుల కృషి పై ప్రశంసలు

సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 24 (ప్రశ్న ఆయుధం న్యూస్): రామచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన 1998-1999 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు అందరూ కలిసి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత 25 సంవత్సరాల క్రితం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ కలిసి పాత గుర్తు చేసుకున్నారు. తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 25 సంవత్సరాలు పూర్తి అయిన మేము మిమ్మల్ని పూర్తిస్థాయిలో మర్చిపోయిన సరే మీరు 25 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించడం ఎంతో సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సాంప్రదాయాలు గతంలో చదువుకున్న విద్యార్థుల దగ్గర మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఇవన్నీ ఎలాంటి సంప్రదాయాలు లేవని పేర్కొన్నారు. అదేవిధంగా 25 సంవత్సరాల క్రితం పదో తరగతి పూర్తి చేసుకున్న న్యాయవాది ఓం ప్రకాష్ మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత పదో తరగతిలో చదువుకున్న విద్యార్థులందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిరంతరం అన్నదానం, ఆట పాటలతో విద్యార్థులందరూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment