*దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వేడుకోలు*
మెదక్/గజ్వేల్, జూలై 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఊరువాడా జరుపుకునే పండుగ బోనాల పండుగ అని ఆషాడమాస బోనాల పండుగను పురస్కరించుకొని ఆదివారం నాడు భాగ్యనగరంలోని తుర్కయంజాల్ లోని కట్ట మైసమ్మ తల్లిని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పుష దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే తల్లి మైసమ్మ తల్లి అన్నారు. అమ్మ వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, పాడిపంటలు సంమృద్దిగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని కోరారు.