Site icon PRASHNA AYUDHAM

రామనామమే జీవన శ్వాసగా రామకోటి రామరాజు

IMG 20250822 WA0041

రామనామమే జీవన శ్వాసగా రామకోటి రామరాజు

కవి తాటి కిషన్ రామభక్తికి అపురూప కావ్యం సమర్పణ

26 ఏళ్లుగా నిర్విరామంగా రామనామ జపంలో రామరాజు

రామనామమే ప్రాణమని జీవనయానం సాగిస్తున్న భక్తుడు

గజ్వేల్‌కు చెందిన కవి, రచయిత తాటి కిషన్ రచన

రామదాసు స్ఫూర్తిగా నిలిచిన రామరాజు భక్తి యానం

శుక్రవారం సన్మానంతో సమర్పించిన కవితా కావ్యం

ప్రశ్న ఆయుధం గజ్వేల్, ఆగస్టు 22:

తెలుగురాష్ట్రాల వ్యాప్తంగా రామనామ పరిమళాలు వెదజల్లుతున్న రామకోటి రామరాజు భక్తి యానం 26 ఏళ్లుగా ఆగకుండా కొనసాగుతోంది. “రామనామమే జీవన ప్రాణం”గా భావిస్తూ కలియుగంలో రామభక్తి మూర్తిగా నిలుస్తున్న రామరాజు భక్తిని గమనించి గజ్వేల్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత తాటి కిషన్ ఆయనను సన్మానించారు. ఈ సందర్భంగా “రామ నామమే అతని జీవన యానము” అనే అపురూప కావ్యాన్ని రచించి సమర్పించారు.

తన పద్యాలలో కవి తాటి కిషన్ రామరాజు భక్తిని గోపన్న, రామదాసు స్ఫూర్తిగా చిత్రించారు. రామనామమే ఉచ్చ్వాస – నిశ్వాసమని, భౌతిక కష్టాలు ఎన్ని వచ్చినా రామపథం వదలని ఓ నిరాడంబర జీవనవైఖరి అని వర్ణించారు. తెలంగాణ చుట్టూరా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోన్నత భక్తునిగా రామరాజు విశేషించారు.

✍️ ఆర్థ కవి, వాగ్గేయకారుడు తాటి కిషన్ రచించిన పద్యాలు:

1. నొసట తిలకం దిద్ది కలియుగ రాముడవు

హృదయాంతరాలలో పూజ ఆమోదుడవు

కాషాయము వేసి కారుణ్య మూర్తుండవు

ఏమి ఆశించని నిర్మల యుద్ధ యోధుడవు

2. ఉచ్చ్వాస, నిచ్చ్వాస రామనామము నీది

ప్రతి కార్యమందున పరిత్యాగ భోదివి

అణువణువు నీలో “రామ” అంటున్నది

తణువంత నీది తాండవమై మోగుతున్నది

3. పేదరికము ఎంతగా పీడించి వేధించిన

రామ పథము ఎప్పుడు వీడ లేదు

కంచర్ల గోపన్న మారు రూపము నీవు

వంశ నామము మార్చి వెలిగావు రామదాసుగా

4. ఏ పూర్వ సుకృతమో “రామా ” అని పిలిచావు

ఏ జన్మ ఫలితమో రామ బాట నడిచావు

నిన్ను కన్న మాత పిత ధన్యులయ్యారు

స్వర్గ మందున నిన్ను చూసి తెగ మురిసేరు

5. తెలంగాణ చుట్టూర ఆధ్యాత్మిక పరిమళానివి

మనసు సుఖ సౌఖ్యాల విత్త ప్రధాతవు

బ్రతుకు అర్థ మెరిగిన బహు ముఖ ప్రజ్ఞడవు

మానవ జన్మ మర్మము విప్పే యోజ్ఞడవు

Exit mobile version