సిద్దిపేట/గజ్వేల్, ఆగస్టు 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): భద్రాచల కల్యాణనికి గోటి తలంబ్రాలు అందించి కల్యాణ అనంతరం రామకోటి సంస్థకు ముత్యాల తలంబ్రాలు భద్రాచల దేవస్థానం అందజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా మంగళవారం శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఏసీపీ నర్సింలుకి తలంబ్రాల పవిత్రత, వాటి విశిష్టత తెలియజేసి అందజేశారు. ఏసీపీ నర్సింలు చేతుల మీదుగా అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తలంబ్రాల పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఏసీపీ నర్సింలు మాట్లాడుతూ.. భద్రాచల తలంబ్రాలు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. లక్షల మంది భక్తులకు ఉచితంగా తలంబ్రాలు పంపిణీ చేయడం రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం అన్నారు. మేము భద్రాచలం వెళ్ళలేకున్న భద్రాచల తలంబ్రాలు మాకు అందడం మా అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం: గజ్వేల్ ఏసీపీ నర్సింహులు
Oplus_131072