*5రకాల పప్పు దినుసులతో అద్భుత యోగా చిత్రం వేసిన రామకోటి రామరాజు*
*7అడుగుల వినూతన చిత్రాన్ని చిత్రించిన రామకోటి సంస్థ*
*గత 30సంవత్సరాలనుండి అనేక రకాల చిత్రాలు ఆవిష్కరణ*
యోగా అనేది ఒక సాధనమని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 5రకాల పప్పు దినుసులు (కందిపప్పు, ఎర్రపప్పు, శనిగెపప్పు, మినుపప్పు, పెసరుపప్పు) ఉపయోగించి 7 అడుగుల యోగా చేస్తున్న భారీ చిత్రాన్ని 3రోజులు శ్రమించి అద్భుతంగా చిత్రించి శనివారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి సందేశాన్నిచ్చారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, ప్రముఖ కళాకారుడు రామకోటి రామరాజు
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వలన శరీరానికి, మనస్సుకు మానసిక ప్రశాంతత చేకూరుతుందని శారీరక ఆరోగ్యం కోసం ప్రపంచం మొత్తం యోగాను తమ జీవన విధానంలో చేసుకుంటున్నారు. చక్కని ఆరోగ్యం కోసం నిర్వహించే అతిపెద్ద ప్రజా ఉద్యమంలో యోగాడే ఒకటన్నారు.