మెదక్/గజ్వేల్, జూలై 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని పురస్కరించుకొని వినూతనంగా ఎర్రపప్పును ఉపయోగించి అత్య అద్భుతంగా అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాద గుండెల్లో వణుకు పుట్టించిన మన్యం విప్లవ వీరుడు యువతకు స్తూర్తి ప్రదాత తెలుగు తేజం అల్లూరి అన్నారు. గత 30 సంవత్సరాలనుండి ఎన్నో రకాల చిత్రాలను ఎన్నో చిత్రింకరించానని తెలిపారు.
ఎర్ర పప్పుతో అల్లూరి చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు

Oplus_0