Site icon PRASHNA AYUDHAM

రామకోటి రామరాజు చేపట్టిన కోటి తలంబ్రాల దీక్ష అద్భుతం: హర్యానా గవర్నర్ బడారు దత్తాత్రేయ, ఎంపీ రఘునందన్ రావు

IMG 20250304 195454

Oplus_131072

IMG 20250304 195444
సిద్దిపేట, గజ్వేల్, మార్చి 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): భద్రాచల సీతారాముల కల్యానానికి గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులచే ఓలిపించి అందిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నాడు జగదేవపూర్ మండలం కొండపోచమ్మ దేవాలయం వద్ద హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ రఘునందన్ రావు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని రామనామ స్మరణ చేస్తూ గోటి వడ్లను ఓలిచి తలంబ్రాలుగా మార్చి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అక్కడే అందజేసి రామభక్తిని చాటుకున్నారు. రామకోటి రామరాజు చేస్తున్న శ్రీరామ సేవలు అమోఘం అని కొనియాడారు. అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ ఎంత బిజీగా ఉన్న కూడా నాలో రామభక్తికి నమస్కరించి వారు సమయాన్ని ఇవ్వడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్, కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి పాల్గొన్నారు.
Exit mobile version