ప్రేమ–అనురాగాలకు ప్రతీక రాఖీ పండుగ – భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

ప్రేమ–అనురాగాలకు ప్రతీక రాఖీ పండుగ

– భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

అన్న–చెల్లెల బంధానికి సంకేతం రాఖీ

మహోన్నత శిఖరాలకు ఎదగాలని చెల్లి ఆకాంక్ష

హారతి, అక్షింతలు, స్వీట్లతో సోదరీమణుల సత్కారం

శ్రీమహాలక్ష్మి–బలి చక్రవర్తి పురాణం గుర్తు

రక్షాబంధం ప్రాధాన్యం వివరించిన రామరాజు

ప్రశ్న ఆయుధం, ఆగస్టు 10

అన్న–చెల్లెల మధ్య ప్రేమ, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తోందని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. రాఖీపౌర్ణమి రోజున సోదరీమణులు అన్నలకు ప్రేమతో రాఖీ కట్టి, మహోన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తారన్నారు. ఈ సందర్భంగా అక్షింతలు వేసి, హారతి ఇచ్చి, స్వీట్లు పంచుకుంటారని వివరించారు. పురాణాల్లో కూడా రక్షాబంధం ప్రాధాన్యం ఉందని, శ్రీమహాలక్ష్మి బలి చక్రవర్తికి రాఖీ కట్టి శ్రీమహావిష్ణువును వైకుంఠానికి తీసుకెళ్లిన కథ అందుకు నిదర్శనమన్నారు. రాఖీ పండుగ ఈ స్నేహ, సోదర భావాలకు చిరస్మరణీయ గుర్తుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment