రామనామ వ్యాప్తికి రామకోటి రామరాజు సేవలు ప్రశంసనీయం – గజ్వేల్ ఏసీపీ నర్సింలు

🔹రామనామ వ్యాప్తికి రామకోటి రామరాజు సేవలు ప్రశంసనీయం – గజ్వేల్ ఏసీపీ నర్సింలు

గజ్వేల్ ఏసీపీ నర్సింలు కి శ్రీరామరక్ష స్తోత్ర పుస్తకం అందజేత

రామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు చేతుల మీదుగా పుస్తకం అందజేత

బద్రాచల దేవస్థానం అందించిన శ్రీరామరక్ష స్తోత్ర పారాయణ పుస్తకాలు

పోలీస్ శాఖ సిబ్బందికి కూడా పుస్తకాలు పంపిణీ

రామనామ వ్యాప్తిలో రామరాజు కృషిని ఏసీపీ నర్సింలు అభినందన

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 16సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గురువారం ఒక భక్తి స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. గజ్వేల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) నర్సింలు కి, బద్రాచల దేవస్థానం నుండి అందిన శ్రీరామరక్ష స్తోత్ర పారాయణ పుస్తకాన్ని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అందజేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ నర్సింలు మాట్లాడుతూ, “రామనామం అమోఘమైనది, మనసుకు శాంతి, సమాజానికి స్ఫూర్తిని ఇస్తుంది. పోలీస్ శాఖ సిబ్బందికి కూడా ఈ పుస్తకాలు పంపిణీ చేయడం ఎంతో సంతోషకరం” అని తెలిపారు.

రామకోటి రామరాజు చేస్తున్న శ్రీరామనామ వ్యాప్తి సేవలు దేశవ్యాప్తంగా అభినందనీయమైనవని ఆయన పేర్కొన్నారు. రామభక్తి ఆవిష్కరించే ఈ కార్యక్రమంలో భక్త సమాజం సభ్యులు కూడా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment