నూతన పద్మశాలి కమిటీకి రామకోటి సంస్థ ఘన సన్మానం

నూతన పద్మశాలి కమిటీకి రామకోటి సంస్థ ఘన సన్మానం

— శుక్రవారం పుట్టపర్తి సత్యసాయి మందిరంలో కార్యక్రమం

— సమాజ సేవలో కృషి చేసిన వారిని గుర్తించడం మన బాధ్యత

గజ్వేల్, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం):

సమాజ సేవ, ఐక్యత, ఆధ్యాత్మికత కలగలసిన వేడుకకు గజ్వేల్ వేదిక కానుంది. శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన పద్మశాలి సంఘం కమిటీ సభ్యులను శుక్రవారం ఉదయం పుట్టపర్తి సత్యసాయి మందిరంలో ఘనంగా సన్మానించనున్నారు.

ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ – “కృషి, పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వీరందరిని సత్కరించడం మా సమాజ బాధ్యత. సమష్టిగా నడిచినప్పుడే సమాజం ఎదుగుతుంది,” అని అన్నారు.

సన్మాన కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు, భక్తులు పాల్గొననున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment