Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డి వరద బాధితులకు రామకృష్ణ మట్ వైద్య శిబిరాలు.

Screenshot 20250907 202431 1

కామారెడ్డి వరద బాధితులకు రామకృష్ణ మట్ వైద్య శిబిరాలు

 

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, సెప్టెంబర్ 7

జిల్లాలో వరదల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న బాధితుల కోసం రామకృష్ణ మట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పిలుపు మేరకు ఆదివారం పోల్కంపేట్ రైతువేదికలో నిర్వహించిన శిబిరంలో బల్కంపేట్, పోల్కంపేట్ తండా, కోమటిపల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన 252 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి దగ్గు, జలుబు, నొప్పులు, బిపి, షుగర్ తదితర వ్యాధులకు మందులు అందజేశారు.

కామారెడ్డి పట్టణంలోని జి.ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన శిబిరంలో 63 మందికి వైద్యసేవలు అందించగా, రామారెడ్డి మండలంలో 125 మంది లబ్ధి పొందారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డిఓ పార్థసింహారెడ్డి, స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version