అక్క కోసం 10 అడుగుల రాఖీ
అద్భుత చిత్రంతో అంకితం చేసిన రామరాజు
గజ్వేల్‌కు చెందిన రామకోటి రామరాజు సృష్టి
రాఖీ కట్టిన అక్క సంధ్యరానికి అంకితం
“ఆ చేతితోనే ఎన్నో అద్భుతాలు” – రామరాజు
కళ, ఆధ్యాత్మికం, సామాజిక రంగాల్లో కృషి సంకల్పం
ప్రశ్న ఆయుధం ఆగష్టు 8
సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు రామకోటి రామరాజు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క సంధ్యరాని జ్ఞాపకాలతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. అవాలను ఉపయోగించి రెండు రోజులు కష్టపడి తయారు చేసిన ఈ అద్భుతాన్ని రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి అక్కకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ – “అక్క రాఖీ కట్టిన చేతితోనే నేను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతాలు సృష్టించాను. అమ్మ తర్వాత అక్కే అమ్మలాంటిది. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి. గతంలో 15 వేల నాణాలతో, కుందేన్స్‌తో, పది పైసల నాణాలతో చిత్రాలు రూపొందించాను. ఇకపై కళ, ఆధ్యాత్మికం, సామాజిక రంగాల్లో మరిన్ని సృష్టులు చేస్తాను” అని తెలిపారు.