మెదక్/రామాయంపేట, సెప్టెంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): రామాయంపేట సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనం దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. రామాయంపేట సర్కిల్ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చిన్న శంకరంపేట, నార్సింగి, చేగుంట, మాసాయిపేట్ మండలంలోని గ్రామాల్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా వినాయక విగ్రహాల శోభాయాత్రలో విద్యుత్ వైరులు విగ్రహాలను తరలించే వాహనాలకు తగలకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త ఉండాలని అన్నారు. వినాయక నిమజ్జనంలో డీజే లకు అనుమతి లేదని, ఎవరైనా ఏర్పాటు చేస్తే డీజే నిర్వాహకులు, మండప నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ వెంకట రాజాగౌడ్ పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలి: రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్
Published On: September 11, 2024 12:43 pm
