సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్రను జయప్రదం చేయాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో కల్లుగీత కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాదిలో గీతన్నల సామాజిక చైతన్య యాత్రను నిర్వహించడం జరుగుతుందని, ఈ యాత్ర ప్రారంభం శనివారం ఉదయం 9గంటలకు కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని బస్టాండు వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఆగస్టు 18న సంగారెడ్డిలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వద్ద ముగింపు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున మన గౌడ సోదరులు కల్లు గీత కార్మికులు గౌడ ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని ఈ సామాజిక చైతన్య యాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు అంజన్నగౌడ్, జిల్లా కార్యదర్శులు ప్రసాద్ గౌడ్, రంగాగౌడ్, రామాగౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు గౌడ్, రవిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ గౌడ్ హరీష్ గౌడ్, నరసింహ గౌడ్, మల్లేశం గౌడ్, శ్రీధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
గీతన్నల సామాజిక చైతన్య యాత్రను జయప్రదం చేయాలి: కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శి ఆశన్నగౌడ్, రమేష్ గౌడ్
Oplus_0