బూర నర్సయ్య గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రమేష్ గౌడ్

మెదక్/నర్సాపూర్, మార్చి 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): బీజేపీ జాతీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ జన్మదినం సందర్భంగా బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం భువనగిరిలోని ఓ ఫంక్షన్ హాల్ లో మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గౌడ్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గీతా సెల్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now