కాంగ్రెస్ పార్టీకి యూత్ ఎల్లప్పుడూ వెన్నెముకలా ఉంటుంధి….బండి రమేష్
ప్రశ్న ఆయుధం జూన్ 30: కూకట్పల్లి ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీకి యూత్ ఎల్లప్పుడూ వెన్నెముకలా ఉంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి సలీం ఆధ్వర్యంలో సోమవారం మూసాపేట్ లోని పార్టీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయవకాశాల్లో యూత్ కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు ,డివిజన్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.