కంది సెంట్రల్ జైలును సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్

*కంది సెంట్రల్ జైలును సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుచనలతో జిల్లా న్యాయ సేవాాధికార సంస్థ కార్యదర్శి బి.రమేష్ కంది సెంట్రల్ జైలును తనిఖీ చేశారు. ఈ తనిఖీలో న్యాయమూర్తి సెంట్రల్ జైలులో ఉన్న బెర్లకు, గదులు, వంట గది, బాత్రూంలు జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించి, ఖైదీలను జైలులో ఉన్న సదుపాయాలను, భోజనం గూర్చి అడిగి తెలుసుకున్నారు. అన్ని ఖైదీలు బెర్లకు క్షుణ్ణంగా పరిశీలించి, వారికీ కావాల్సిన అవసరాలు, సదుపాయాలు అన్ని అందించేలా చూడాలని జైలు సూపరింటెండెంట్ గారికి తెలియజేశారు. వారికీ ఖైదీలతో వారికీ సమయానికి బైల్స్, ములాఖత్ అందుతున్నాయా, కేసులు పరిష్కరించేందుకు న్యాయ సేవలు పొందేందుకు ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని ఖైదీలకు తెలియపరిచారు. ఖైదీలకు పెడుతున్న భోజనం రుచి చూశారు. ఖైదీల కోసం వండే కూరగాయలు, బియ్యం, ఉన్న రూమ్ ను కూడా తనిఖీ చేశారు. జైల్లో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ కూడా పరిశీలించారు. వీరి వెంట జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment