Site icon PRASHNA AYUDHAM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందడుగు….బండి రమేష్ 

IMG 20251018 WA0023 1

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందడుగు….బండి రమేష్

ప్రశ్న ఆయుధం, అక్టోబరు 18: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని టిపిసి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. శనివారం బీసీ సంఘాలు నిర్వహించిన బందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంగా మద్దతు తెలిపిన తెలిసింది.ఈ మేరకు కూకట్పల్లి నియోజకవర్గంలో రమేష్ ఆధ్వర్యంలో మూసాపేట్ లోని మున్సిపల్ కార్యాలయం నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వరకు పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి బీసీ సంఘాలు వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ బంద్ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీల సైతం పాల్గొని పూర్తి మద్దతు పలికాయి. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ బిజెపి పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కేంద్రం తలుచుకుంటే ఈ విషయంలో ఐదు నిమిషాల్లో బిల్లు పాస్ చేయవచ్చని కానీ ఉద్దేశపూర్వకంగానే బిల్లును పక్కన పెట్టిందన్నారు.రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు వెళుతుందన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version