నల్లచెరువు సుందరీ కరణ పనులను పరిశీలించిన….బండి రమేష్ 

నల్లచెరువు సుందరీ కరణ పనులను పరిశీలించిన….బండి రమేష్

ప్రశ్న ఆయుధం జులై01: కూకట్‌పల్లి ప్రతినిధి

పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని టిపిసిసి ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ పేర్కొన్నారు. పేద ప్రజలకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోదన్నారు. కూకట్పల్లిలో ఉన్న నల్లచెరువులో కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఇటీవల సుందరీ కరణపనులను చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న పనుల తీరును రమేష్ స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్ల చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని వాకింగ్ ట్రాక్ జాగింగ్ ట్రాక్ గ్రీనరీ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఇక్కడ ఉన్న నాయకులు చెరువులు నాళాలు ఎఫ్ టి ఎల్ ప్రాంతాలను దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. 33 ఎకరాలు ఉన్న ఈ చెరువు ప్రస్తుతం చాలా వరకు కబ్జాకు గురైంది అన్నారు. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఉన్న చెరువునైనా కాపాడాలని ఉద్దేశంతో ఈ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఎఫ్ టి ఎల్ పరిధిలో ఎవరికైనా నిజంగా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. హైడ్రా కమిషనర్ గతంలో చెరువును పరిశీలించి కబ్జాకు గురైనట్లు ధ్రువీకరించారు. నియోజకవర్గ పరిధిలోని చెరువులను ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలోనియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ. నాయకులు, మైనారిటీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment