*ఈ నెల ఐదున రాములోరి హుండి లెక్కింపు*
*ఇల్లందకుంట మార్చి 2 ప్రశ్న ఆయుధం*
అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు ఈనెల 5వ తేదీ బుధవారం రోజున నిర్వహించబడునని ఆలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆలయ హుండీ లెక్కింపులలో పాల్గొని భక్తులు సాంప్రదాయ దుస్తువులైన లుంగీ బనీను ధరించి బుధవారం ఉదయం 10:00 లోపు హాజరుకావాలని కోరారు ఈ హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో భక్తుల సమక్షంలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు