*రాములోరి హుండీ లెక్కింపు*
*శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు*
*ఇల్లందకుంట ఏప్రిల్ 21 ప్రశ్న ఆయుధం*
అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16 తో ముగియడంతో ఏప్రిల్ 22 మంగళవారం రోజున ఆలయంలోని హుండీలను లెక్కించడం జరుగుతుందని దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు తెలిపారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించబడుతుందని హుండీ లెక్కింపు పాల్గొని భక్తులు సాంప్రదాయ దుస్తులలో రావాలని కోరారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు సాంప్రదాయ దుస్తుల్లో( లుంగీ బనీన్) వచ్చి దేవాలయ కార్య నిర్వహణ అధికారి కందుల సుధాకర్ ను సంప్రదించాలని కోరారు