రండి…జంఝావతిని సాధిద్దాం…!

*రండి…జంఝావతిని సాధిద్దాం…!*

*జంఝావతి సాధన సమితిలో పాలు పంచుకోండి

*రైతులు, రైతు మిత్రులు, రైతు, ప్రజా, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలకు ఆహ్వానం*

*నేడు పార్వతీపురంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి సర్వసభ్య సమావేశం

*ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 20 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పార్వతీపురం:

అధికారుల అలసత్వం, పాలకుల నిర్లక్ష్యం వెరశి దశాబ్దాలుగా రైతులకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న పార్వతీబ్రహ్మణ్యం జిల్లాలోని కొమరాడ మండలంలో గల జంఝావతి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో సాధించుకుందామని, దానికోసం ఏర్పాటు చేస్తున్న జంఝావతి సాధన సమితిలో పాల్గొనాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిశర్ల మాలతి కృష్ణమూర్తి నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం పార్వతీపురంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు జాగారపు ఈశ్వర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు మంగల దాలి నాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి బలగ శంకరరావు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 21వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఏపీ ఎన్జీవో హోంలో ఉత్తరాంధ్రాక్షర్యుల పరిరక్షణ సమితి సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తొలుత జంఝావతి సాధన సమితిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జంఝావతి సాధన కోసం తమ సమితి పలు కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇప్పుడు రైతులు, రైతు మిత్రులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు మేధావులు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా ప్రతినిధులతో జంఝావతి సాధన సమితి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దాని ద్వారా భవిష్యత్ కార్యాచరణ చేపట్టి జంఝావతి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో సాధించడం జరుగుతుందన్నారు. జంఝావతి ప్రాజెక్టు గూర్చి అడిగే నాథుడు లేకపోవడంతో రాజకీయ పార్టీలు ఎన్నికల హామీగా జంఝావతిని ఉపయోగించుకుంటున్నాయన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో, ఒడిస్సాలో సానుకూల ప్రభుత్వాలు ఉండటంతో జంఝావతిని సాధించవచ్చు అన్నారు. దానికి అన్ని వర్గాల సహాయ సహకారాలతో సమితి అవసరమన్నారు. అనంతరం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ఆయా కార్యవర్గాల కార్యాచరణను చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో ఉన్న ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే జంఝావతి సాధన సమితిలో పాలు పంచుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Join WhatsApp

Join Now