కూల్చివేతలే ఫుల్ క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..

నోటీసుల్లేవు.. కూల్చివేతలే..

ఫుల్ క్లారిటీ ఇచ్చిన రంగనాథ్..

IMG 20240827 WA0128

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది. ముఖ్యంగా.. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్ చేసింది హైడ్రా. హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన చెరువులను సంరక్షించడమే లక్ష్యంగా, ఆక్రమణలు తొలగించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. విధి నిర్వహణలో అంచనాలకు మించి దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో అక్రమార్కులు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హైడ్రా చర్యలపై, నిర్ణయాలపై ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. హైడ్రాపై వస్తున్న ఆరోపణలుకు క్లారిటీ ఇచ్చారు.ఓవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి అయినా.. ఎవరైనా హైడ్రాకు ఒక్కటేనని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు, నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఏమాత్రం ఆలోచించకుండా వాటిని కూల్చివేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. హైడ్రా ఎవ్వరికి నోటీసులు ఇవ్వదని.. డైరెక్ట్ కూల్చివేతలే చేస్తుందని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు కమిషనర్ రంగనాథ్. హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో పాము అవ్వదల్చుకోలేదన్నారు. తమకు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.అయితే, విద్యా సంస్థల విషయంలో కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. విద్యా సంస్థలు బఫర్ జోన్‌లో, FTL లో ఉంటే.. స్టూడెంట్స్‌ను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటామన్నారు. FTL, బఫర్‌లో కట్టిన విద్యా సంస్థలను వెంటనే కూల్చివేస్తే.. స్టూడెంట్స్ రోడ్డు మీద పడతారని.. విద్యా సంవత్సరం డిస్టబ్ అవుతుందన్నారు. అలాంటి వాటికీ కొంచెం టైమ్ ఇచ్చి కూల్చివేస్తామని రంగనాథ్ తెలిపారు. హైడ్రా పేద వాళ్ళ జోలికి, చిన్న వాళ్ళ జోలికి వెళ్ళదని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now