Site icon PRASHNA AYUDHAM

తలసరి ఆదాయంలో తెలంగాణ కింగ్.. రంగారెడ్డి జిల్లా టాప్..!!

తలసరి
Headlines
  1. తలసరి ఆదాయంలో తెలంగాణ తొలి స్థానం: రంగారెడ్డి అగ్రస్థానంలో!
  2. జాతీయ సగటు ఆదాయాన్ని మించి రంగారెడ్డి జిల్లా రికార్డు.
  3. తెలంగాణ కింగ్: రంగారెడ్డి జిల్లా పథకాలు ప్రజల ఆదాయాన్ని పెంచాయి.
  4. తెలంగాణపై గర్వం: రంగారెడ్డి దేశంలో టాప్!
  5. రంగారెడ్డి జిల్లా దేశం మొత్తంలో సత్తా చాటింది, కొత్త రికార్డులు.
దేశంలో తలసరి ఆదాయం అధికంగా ఉన్న జిల్లాల జాబితాలో తెలంగాణ సత్తా చాటింది. తలసరిలో తెలంగాణ సిరికి సరిలేరని రుజువు చేసింది. ఇందులో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దేశంలోనే తొలి స్థానం దక్కించుకుంది.

జాతీయ సఘటులో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న 25 సంపన్న జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఇందులో తొట్టతొలి స్థానంలో దేశంలోనే అత్యధిక తసలరి ఆదాయం ఉన్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా చోటు సాధించి అగ్రస్థానంలో బెర్తు ఖాయం చేసుకుంది. రూ. 11,46,000 తలసరి ఆదాయంతో ప్రజల జీవన ప్రమాణ స్థాయిలను ప్రతిబింబింపజేసింది.

ఆ తర్వాత వరుసగా రూ.905000 తో హర్యానాలోని గుర్గావ్, కర్నాటకలోని బెంగళూరు రూ. 893000లతో తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. యూపీలోని గౌతమ బుద్ధనగర్ జిల్లా రూ.848000 తలసరి ఆదా యంతో 4వ స్థానంలో, హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లా 5వ స్థానంలో గోవా 6వ స్థానంలో, 4 జిల్లాలతో కూడిన సిక్కిం 7వ స్థానంలో, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా 8వ స్థానంలో, దేశ వాణిజ్య రాజధాని ముంబయి 9వ స్థానంలో నిల్చాయి. అహ్మదాబాద్ 10వ స్థానంలో, గాంధీనగర్ 11వ స్థానంలో, కర్ణాటకలోని ఉడిపి జిల్లా 12వ స్థానంలో నిల్చాయి. హైదరాబాద్ 18వ స్థానంలో నిలువగా, ఢిల్లీ 25వ స్థానాకికి పరిమితమైంది. దేశ జాతీయ సగటు తలసరి ఆదాయం రూ. 225000గా నమోదైంది.

Exit mobile version