సర్దార్ పాపన్న గౌడ్ జయంతికి జనసంద్రం కావాలి..రంగోల్ల మురళి గౌడ్

సర్దార్ పాపన్న గౌడ్ జయంతికి జనసంద్రం కావాలి

రేపు రవీంద్రభారతిలో 375వ జయంతి వేడుకలు

జై గౌడ ఉద్యమం ఆధ్వర్యంలో మహోత్సవం

విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి పిలుపు

బహుజన మహనీయుని స్ఫూర్తి, గౌరవం ప్రతీ ఇంటికి చేరాలని ఆకాంక్ష

విలేకరుల సమావేశంలో నేతల పిలుపు, ఏర్పాట్ల సమీక్ష

ప్రశ్న ఆయుధం కామారెడ్డి ఆగష్టు 9,

హైదరాబాద్‌: ఆదివారం రోజున రవీంద్రభారతిలో జరగనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 375వ జయంతి ఉత్సవాలకు భారీ సంఖ్యలో తరలి రావాలని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళి గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం కామారెడ్డి ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ వేడుకలను బహుజన మహనీయుని గౌరవానికి తగిన రీతిలో కనుల పండుగగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డా. వట్టికూడి రామారావు గౌడ్ అధ్యక్షతన 18వ సారి నిర్వహిస్తున్న ఈ మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారు, శ్రీనివాస్ గౌడ్, ఇందూరి సిద్దా గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, నందివాడ ప్రశాంత్ గౌడ్, రాజంపేట దేవేందర్ గౌడ్, తాటిపాముల భూపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now