Site icon PRASHNA AYUDHAM

వలిగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాపోలు సుదర్శన్

IMG 20241128 WA0186

*వలిగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా రాపోలు సుదర్శన్*

వలిగొండ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గత 30 సంవత్సరాలుగా పత్రికా రంగంలో అనుభవజ్ఞులైన పత్రిక రంగానికి సేవలందిస్తున్న రాపోలు సుదర్శన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వలిగొండ ప్రెస్ క్లబ్ సభ్యులు రాపోలు సుదర్శన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జర్నలిస్టులంతా నిబద్ధత పాటించాలని అవినీతి అక్రమాలను బయటపెడుతూ వార్తలను రాసే ప్రతి జర్నలిస్టుకు ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని పత్రికా రంగాన్ని కాపాడుకోవాలంటే నిజాయితీగా నిజమైన వార్తలు తప్పనిసరి అని అన్నారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న వలిగొండ ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు

Exit mobile version