*గుంటూరు జిల్లా*
*తాడేపల్లి లో అరుదైన పిల్లి హల్ చల్…*
*ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి*
*గుంటూరు జిల్లా తాడేపల్లి లో పునుగు పిల్లి ప్రత్యక్షమైంది.*
*ఈ అరుదైన పిల్లి తాడేపల్లి ముగ్గురోడ్డు లోని గొట్టుముక్కల లాజర్ నివాసంలో ఉదయం సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందారు*
*స్థానికుల సమాచారం మేరకు వైసిపి నాయకులు తాడేపల్లి మాజీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ చొరవతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.*
*ముదిగొండ ప్రకాష్ సమాచారం ఇవ్వడంతో వచ్చి పిల్లిని తీసుకెళ్లిన అటవీశాఖ అధికారులు.*
*పునుగు పిల్లిని స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కు తీసుకువెళ్లి చికిత్స అందించిన అనంతరం అడవిలో వదిలివేయనున్నట్టు తెలిపారు.*